పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట లో 1924 లో గొడవర్తి నాగేశ్వర రావు గారిచే నిర్మించబడింది. దీనిని స్థానికంగా పెద్ద మేడ గా వ్యహరిస్తారు. నాణ్యమైన రంగూన్ టేక్ తో నిర్మితమైన మూడంతస్తుల భవన శైలి ఆర్కిటెక్చర్ విద్యార్దులను ఆకర్షిస్తోంది. ఇందులో ఉన్న రవి వర్మ చిత్రాలకు, అందమైన అద్దాలు లకు ప్రసిద్ది చెందింది. ఈ భవనంలో ఉన్న పియానో ఇంగ్లాండ్ లోని వేలంలో సిల్వర్ అవార్డ్ పొందింది.
ఎలా చేరుకోవాలి?
ఆచంట గ్రామం కోడేరు - మార్టేరు రాష్ట్ర రహదారి 219 మార్గం లో ఉంది. ఇది మండల కేంద్రం. ఇక్కడకు పాలకొల్లు, తాడేపల్లిగూడెం పట్టణాల నుండి రోడ్డు మార్గం లో చేరుకోవచ్చు.
సమీప పట్టణం: - పాలకొల్లు (17 కిమీ)
సమీప బస్ స్టేషన్: - పాలకొల్లు (17 కిమీ)
సమీప రైల్వే స్టేషన్: - పాలకొల్లు (17 కిమీ)
సమీప విమానాశ్రయం: - రాజమహేంద్రవరం (67 కిమీ)
సమీప వసతి, భోజన సౌకర్యం
9 km దూరం లో ఉన్న మార్టేరు లో బడ్జెట్ హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. పాలకొల్లు (17 km), దిండి (25 km) లలో రెస్టారెంట్ లు, స్టార్ కేటగిరీ హోటల్స్ అందుబాటులో ఉన్నాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి